కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తమకు మంత్రి పదవులు దక్కుతాయనుకుంటున్న ఆశావహుల ఆశలపై కాంగ్రెస్ హైకమాండ్ నీళ్లు గుమ్మరించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ బేధాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత తరుణంలో కొందరికి మంత్రి పదవులను ఇచ్చి మరికొందరికి మొండిచెయ్యి చూపిస్తే తమకే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉన్నట్లు అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కనుక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌కు పదవులను కట్టబెట్టే అంశాన్ని పక్కనపెట్టాయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల్లో కొందరు మాత్రం తమకు పదవులు దక్కడం ఖాయమని బల్లగుద్ది మరీ చెపుతున్నారు. అసలు సంగతి తెలియాలంటే మరికొన్ని గంటలపాటు వేచి చూడాల్సిందే.