రాష్ట్రంలోనే కాకుండా దేశ నేతలకు కూడా విలువలతో కూడిన రాజకీయాలు నేర్పిన మహనీయుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 15వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన రాజకీయాల్లో నిస్వార్థ సేవ చేశారన్నారు. ముఖ్యంగా, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ప్రతి ఒక్కరికీ నేర్పించారన్నారు.
ఢిల్లీ వీధుల్లో తెలుగుజాతి ఆత్మగౌరవం తాకట్టుకు గురైన సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏమిటో చూపించారన్నారు. అలాంటి మహనీయునుకి భారతరత్న అవార్డును ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సినీ, రాజకీయాల్లో ఎన్టీఆర్ వంటి వ్యక్తి మరొకరు లేరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.