Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి పులివెందులలో వైఎస్.జగన్మోహన్ పర్యటన!!

నేటి నుంచి పులివెందులలో వైఎస్.జగన్మోహన్ పర్యటన!!
సొంత పట్టణం పులివెందులలో యువనేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన పులివెందులకు చేరుకున్నారు. జగన్ పర్యటన వివరాలను ఆయన బంధువు వైఎస్.భాస్కర్ రెడ్డి, వైఎస్.మనోహనర్ రెడ్డి వివరించారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా 14వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన నివాసంలోనే ఉంటారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు బైపాస్‌రోడ్డులోని ఈద్గా మైదానంలో ముస్లిం మైనార్టీలతో సమావేశమవుతారు. 3.30 నుంచి 4.30 వరకు రజక సంఘం కార్యాలయంలో రజకులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. 4.30 నుంచి 6 గంటల వరకు వికలాంగుల కార్యాలయంలో వికలాంగులు, ఎరుకల, హమాలీలతో సమావేశమవుతారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో సమావేశమై వారి మద్దతును కూడగట్టుకుంటారు.

రెండోరోజైన 15వ తేదీన ఉదయం 8.30 నుంచి 10.30 వరకు రవీంద్రనాథ్ పాఠశాల ఆవరణలో దూదేకుల సంఘం ప్రతినిధులతో, 10.30 నుంచి 11 గంటల వరకు వస్త్ర, బంగారు వ్యాపారులతో సమావేశం. 11 నుంచి ఒంటి గంట వరకు తితిదే కల్యాణ మండపంలో వడ్డెరలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు మిట్టమల్లేశ్వర కల్యాణమండపంలో నాయీ బ్రాహ్మణులతోను, 3 నుంచి 4 వరకు పాల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో మహిళా సంఘాలతో, 4 నుంచి 6 వరకు కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో బలిజసంఘం వారితో సమావేశం అవుతారని తెలిపారు. చివరి రోజు పర్యటన వివరాలను తర్వాత వెల్లడిస్తామని వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu