Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి డీఎల్‌పై సహచర మంత్రివర్యుల చిర్రుబుర్రులు!!

మంత్రి డీఎల్‌పై సహచర మంత్రివర్యుల చిర్రుబుర్రులు!!
, బుధవారం, 12 జనవరి 2011 (10:24 IST)
యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డిపై సహచర మంత్రివర్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇపుడు మన సర్కారు నడి సముద్రంలో నావలా ఉందని ఎవరినీ రెచ్చగొట్టినా మునిగేది మనమేనని వారు గుర్తు చేశారు.

అందువల్ల ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని పలువురు మంత్రులు ఆయన ఘాటుగానే చెప్పారు. అంతటితో ఆగని వారు ఏకంగా మంత్రి డీఎల్‌పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సైతం సిద్ధమయ్యారు.

ఢిల్లీలో చేపట్టిన జల దీక్షలో జగన్ కొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తాను తలచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని, తన దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆధాపపడివుందన్నారు.

దీనిపై మంత్రి డీఎల్ హైదరాబాద్‌లో ఘాటుగానే స్పందించారు. జగన్‌కు చీము నెత్తురు ఉంటే ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు సహచర మంత్రులు ఆయనపై మండిపడ్డారు.

ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేల భవితవ్యంపైనే ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర సర్కారుకు కష్టాలు తప్పవని, అలాగే, జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామా చేస్తే కేకేఆర్ సర్కారు మైనారిటీలో పడిపోవడం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు.

ఈ అంశాలన్నీ బేరీజు వేసుకుని ఎవరైనా మాట్లాడాలన్నారు. ఇష్టాను సారంగా మాట్లాడితే నష్టపోయేది మనమేనని పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు వాపోయారు. మొత్తం మీద జగన్ ఢిల్లీ జలదీక్షలో చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ అధిష్టానాన్ని, ఇటు రాష్ట్ర సర్కారుకు ముచ్చెమటులు పట్టించేలా చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu