Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ దీక్షకు రాజకీయాలు అంటగట్టొద్దు: సబ్బం హరి

Advertiesment
వైఎస్ జగన్మోహన రెడ్డి
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు, కడప మాజీ ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి కృష్ణా జలాల కోసం హస్తినలో చేయనున్న ఒక్క రోజు దీక్షకు రాజకీయాలు అంటగట్టాల్సిన అవసరం లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. యువనేత వై.ఎస్. జగన్ ఈ నెల 11న హస్తినలో చేపట్టనున్న దీక్ష రాజకీయ దీక్ష కాదని సబ్బం హరి మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే వై.ఎస్.జగన్ ఈ దీక్ష చేపట్టనున్నట్లు హరి వెల్లడించారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయాన్ని ప్రభుత్వానికి ఎత్తిచూపడం కోసమే జగన్ ఈ దీక్షను చేపడుతున్నారని హరి తెలిపారు. ఇంకా కృష్ణా జలాల విషయమై అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకే జగన్ ఒక్క రోజు దీక్ష చేస్తున్నారని సబ్బం వెల్లడించారు.

మరోవైపు కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. దేశ రాజధానిలో చేపట్టనున్న ఒకరోజు దీక్ష కోసం మద్దతుదారులు, అనుచరులతో కలిసి జగన్ ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలు దేరతారు.

Share this Story:

Follow Webdunia telugu