Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పేరు వైఎస్ఆర్ పార్టీ?

వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పేరు వైఎస్ఆర్ పార్టీ?
, బుధవారం, 5 జనవరి 2011 (16:29 IST)
యువ నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏర్పాటు చేయనున్న పార్టీకి రెండు పేర్లను పరిశీలిస్తున్నారు. ఇందులో ఒక పేరు వైఎస్ఆర్ పార్టీ కాగా, మరొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్. వీటిలో ఏదో ఒక పేరును కొత్త పార్టీకి కేటాయించాల్సిందిగా జగన్ తరపున ఆయన మామ వైవీ.సుబ్బారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు బుధవారం ఢిల్లీలో వినతిపత్రం సమర్పించారు.

గతయేడాది నవంబరులో తన పార్లమెంట్ సభ్యత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీతో కూడా జగన్ తెగతెంపులు చేసుకున్న విషయం తెల్సిందే. తండ్రి హఠాన్మరణం అనంతరం ఆయన రాజకీయ వారసునిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించక పోవడంతో ఆగ్రహించిన ఆయన ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకున్నారు.

దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్.. కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులోభాగంగా వైవీసుబ్బారెడ్డి ఈసీకి కొత్త పార్టీకి సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ అనే పేర్లను దరఖాస్తుల్లో పేర్కొన్నారు.

అయితే, అనేక మంది నేతలు, మద్దతుదారులు, అనుచరులు మాత్రం పార్టీ పేరులో కాంగ్రెస్ అనే పదం ఉండరాదని గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో జగన్ కొత్త పార్టీ పేరు వైఎస్ఆర్ పార్టీగా నామకరణం కావొచ్చని భావిస్తున్నారు.

ఇదిలావుండగా, వచ్చే ఉప ఎన్నికల్లో కడప ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నట్టు జగన్ ప్రకటించారు. అలాగే, పులివెందుల స్థానం నుంచి తన తల్లి విజయలక్ష్మి పోటీ చేస్తారని. ఈ పోటీ కూడా కొత్త పార్టీ తరపున ఉంటుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu