Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన రాష్ట్రానికి గవర్నర్‌గా పిచ్చి వ్యక్తి: తెరాస నేత హరీష్ రావు

Advertiesment
హరీష్ రావు
, మంగళవారం, 4 జనవరి 2011 (11:27 IST)
మన రాష్ట్రంలో ఒక పిచ్చి వ్యక్తి గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజ్‌భవన్‌ వీడి తెలంగాణ పల్లెల్లోకి వస్తే ప్రజల స్పందన ఏమిటో తెలుసుకోవచ్చని సూచించారు.

మెదక్ జిల్లా సిద్ధిపేటలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోరుతూ చేపట్టిన రిలే నిరాహారదీక్ష చేపట్టి సోమవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎవరు అడ్డొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చివరకు గవర్నర్‌ అడ్డు వచ్చినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అంతేకాకుండా, మన రాష్ట్రానికి ఓ పిచ్చి గవర్నర్‌ వచ్చారన్నారు. తెలంగాణా పట్ల హేళనగా మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

కష్టాలు పోవాలని ఓ వైపు తెలంగాణా ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే గవర్నర్‌ అవహేళనగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీ కృష్ణకమిటీ నివేదిక ఇచ్చే డిసెంబర్‌ 31వ తేదీ తర్వాత జనవరి 1 వస్తుందంటూ హేళనగా మాట్లాడిన విషయాన్ని హరీష్ గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu