రాబోయే ఉప ఎన్నికలలో ఎంపిగానే పోటీ చేస్తానని యువనేత, కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకు జరిగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనని హిందూస్థాన్ టైమ్స్ అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి దాదాపు నెలరొజులు గడచిన అనంతరం ఆయన తన భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేకపోయినప్పటికీ ఎంపీగానే పోటీ చేస్తానని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 1994 నాటి పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వైఎస్ఆర్ మరణ వార్త విని తెలంగాణాలో 350 మంది మరణించారని, వారిని ఓదార్చడానికి త్వరలోనే తెలంగాణాలో పర్యటిస్తానని జగన్ తెలిపారు.