ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై తమ అధ్యయనంలో తేలిన అంశాలను సవివరంగా నివేదికలో పొందుపరిచామని, వీటిని మెజారిటీ ప్రజలు స్వాగతిస్తారనే నమ్మకం, విశ్వాసం తమకు ఉందని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది. ఈ కమిటీ సభ్యులు శుక్రవారం న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. నివేదికను తయారు చేసేందుకు తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను వీలేంత మేరకు స్వాగతిస్తారని కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణ అన్నారు.
వచ్చే నెల ఆరో తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ఆధ్వర్యంలో జరిగే అఖిలపక్షం సమావేశం తర్వాత ఈ కమిటీ అంశాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటాయని కమిటీ సభ్యుడు వీకేదుగ్గల్ అన్నారు. ఇందులో పేర్కొన్న అంశాలు అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరుస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇకపోతే.. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు, మైనారిటీలు సమగ్ర అభివృద్ధిని బలంగా కోరుకుంటున్నారని మరో సభ్యుడు అబూసలేం అన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన మహిళలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారని రవీంద్రకౌర్ అన్నారు.