కాంగ్రెస్ పార్టీ 126వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను మంగళవారం రాష్ట్ర రాజధానిలోని గాంధీ భవన్‌లో జరిగాయి. ఈ వేడుకలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి తదితరులు హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అభిష్టం మేరకే తెలంగాణపై సోనియాగాంధీ నిర్ణయం ఉంటుందన్నారు. ప్రస్తుతం పార్టీ, ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.
అయితే, అనంతపురం జిల్లాలో ఈ వేడుకలు రసాభాసగా మారాయి. ఈ జిల్లాలో కాంగ్రెస్ వర్గ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన డీసీసీ సమావేశంలో మంత్రి రఘువీరా, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణలు చెలరేగి ఒకరిపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారిని సర్ధి చెప్పారు.