Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖ్యమంత్రి కేకేఆర్ పేకాటరాయుడు: తెదేపా నేత ఎర్రబెల్లి

ముఖ్యమంత్రి కేకేఆర్ పేకాటరాయుడు: తెదేపా నేత ఎర్రబెల్లి
, శుక్రవారం, 24 డిశెంబరు 2010 (13:31 IST)
అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్.కిరణ్ కుమార్ రెడ్డికి రైతు సమస్యల గురించి ఏం తెలుసని తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత సీనియర్ నేతల ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ఈయనకు పేకాట, గుర్రుపు స్వారీ పందేలు, క్రికెట్ ఆడమే తెలుసన్నారు. ప్రజలు, రైతు సమస్యల గురించి ఏమాత్రం తెలియదన్నారు. అందుకే ఆయన ఒంటెద్దు పోకడలను అవలంభిస్తూ మొండివైఖరిని చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం పార్టీ అధినేత చంద్రబాబు గత ఎనిమిది రోజులుగా కొనసాగిస్తున్న దీక్షపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయన శుక్రవారం సచివాలయంలోని సీ బ్లాక్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎంకు పేకాట, గుర్రపు పందెం, క్రికెట్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఎద్దేవా చేశారు.

అంతకుముందు తెదేపాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేపట్టిన సచివాలయం ముట్టడికి విఫలమైంది. సచివాలయానికి ర్యాలీగా వెళుతున్న తెదేపా, వామపక్ష శ్రేణులను శుక్రవారం పోలీసులు రవీంద్రభారతి వద్దే అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, తెదేపా నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అరెస్టు చేసిన తెదేపా ఎమ్మెల్యేలను గోషామహాల్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu