రైతులు నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని హెచ్చరించింది.
తెలుగుదేశం పార్టీ హెచ్చరికపై ఆరోగ్యశాఖామంత్రి రవీంద్రా రెడ్డి స్పందిస్తూ... అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులకు పూర్తిన్యాయం చేస్తున్న సర్కార్ తమదేనని మరోసారి చెప్పుకొచ్చారాయన.
ఇదిలావుండగా, చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి తమ నేత అరెస్టుకు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.