విద్యుత్ ఛార్జీలు తగ్గించు మహాప్రభో అంటూ ఆనాడు బషీర్‌బాగ్‌లో రైతులు ఆందోళన చేస్తే వారి పట్ల కర్కశంగా ప్రవర్తించడమే కాక వారిపై కాల్పులు జరిపిన ఘనుడు చంద్రబాబు అనీ, అటువంటి ఆయన రైతులకోసం నిరాహార దీక్ష చేయడం హాస్యాస్పదమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు.
రైతుల రుణం తీర్చుకునేందుకు దీక్ష చేస్తున్నానంటున్న బాబు, ఆయన హయాంలో అసలు రైతులకు ఎటువంటి న్యాయం చేశాడో ఆలోచించుకోవాలన్నారు.
రైతు పక్షపాతిగా, రైతుల బాధలను తీర్చింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు. ప్రస్తుతం బాబు చేస్తున్న దీక్ష కేవలం రాజకీయ స్వార్థంకోసం తప్పించి రైతులకోసం కాదని షబ్బీర్ విమర్శించారు.