Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతుల రుణం తీర్చుకోవడానికే నా పోరాటం: చంద్రబాబు

రైతుల రుణం తీర్చుకోవడానికే నా పోరాటం: చంద్రబాబు
, ఆదివారం, 19 డిశెంబరు 2010 (14:50 IST)
తాను అనని మాటలు తనకి అంటగట్టి రైతులకు దూరం చేసే కుట్ర చేశారని నిరవధిక దీక్షలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రైతుల రుణం తీర్చుకునేందుకే తాను పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు. విపత్తు బాధితులకు నష్టపరిహారం, పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ తన పోరాటం ఆగదని మాజీ ముఖ్యమంత్రి తెలిపారు.

ఇదిలా ఉండగా.. రైతు సమస్యలపై నిరవధిక దీక్ష చేస్తున్న బాబును పరామర్శించే వారు సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తాజాగా.. చంద్రబాబు అల్లుడు, ప్రముఖ సినీనటుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా తన మామ చంద్రబాబును పరామర్శించారు. ఆదివారం నాడు మందకృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్యలు కూడా బాబును కలిసి తమ సంఘీభావం ప్రకటించారు.

కాగా.. బాబు మరో అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సోమవారం సంఘీభావ దీక్ష చేపట్టనున్నారు. న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌‌లో చంద్రబాబుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరోజు పాటు దీక్ష చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu