Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు

మహబూబ్‌నగర్ ఎంపీ సీటు ఇస్తా..: జితేందర్‌కు కేసిఆర్ హామీ

బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు
, ఆదివారం, 19 డిశెంబరు 2010 (14:06 IST)
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం ఎదురైంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గట్టి పట్టున్నటిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణాపై చంద్రబాబు వైఖరి నచ్చకపోవడం వల్లే టిడిపిని వీడుతున్నట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణా అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నరని, తెలంగాణా ప్రకటన తర్వాత చంద్రబాబు వ్యాఖ్యలతో మనస్తాపం చెందామని అందుకే పార్టీను వీడిపోతున్నామని ఆయన చెప్పారు. ఈ మేరకు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపనున్నట్లు జితేందర్ రెడ్డి తెలిపారు.

ఈనెల 22న మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరుతున్నామని, తనతో పాటు కొల్లాపూర్ టిడిపి ఇంచార్జ్ జగదీశ్వరరావు కూడా టిఆర్ఎస్‌లో చేరుతున్నారని జితేందర్ తెలిపారు. జితేందర్ రెడ్డికి మహబూబ్‌నగర్ ఎంపీ సీటు ఇస్తానని కెసిఆర్ మాట ఇచ్చినట్లు సమాచారం.

జితేందర్ రెడ్డి గత సాధారణ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలనుకున్నారు. అయితే అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న కారణంగా సదరు ఎంపీ సీటును టిఆర్ఎస్ అధినేత కేసిఆర్‌కు వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో కేసీఆర్‌పై పోటీ చేద్దామని నిర్ణయించుకున్నప్పటికీ బాబు బుజ్జగించడంతో ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో చేసేది లేక జితేందర్ చేవెళ్ల నుండి శాసనసభ్యుడిగా పోటీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu