తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టి పట్టున్నటీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బాబు వైఖరికి నిరసనగా జితేందర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో తెలంగాణాలో టిడిపికి భారీ గండేపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా.. జితేందర్ తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ తాయిలం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు సన్నిహత వర్గాలు అంటున్నాయి.
జితేందర్ చేరికతో టిఆర్ఎస్ మరింత బలపడుతుందని పలువురు నేతలు భావిస్తున్నారు. జితేందర్ రెడ్డి బాటలో గద్వాల్ మాజీ ఎమ్మేల్యే గట్టు భీముడు కూడా టిఆర్‌ఎస్ చేరే అవకాశం ఉంది. ఇప్పటికే జితేందర్ టిఆర్ఎస్ నేత హరీష్‌రావుతో రహస్యమంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
ఇదే గనుక జరిగితే జితేందర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు కూడా టిఆర్ఎస్‌లో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 21 లేదా 22 తేదీలలో జితేందర్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.