తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రైతుల కన్నీళ్లు ఏనాడు పట్టించుకోని తెరాస పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ రైతంగానికి క్షమాపణ చెప్పాలని నామా డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాజకీయ దీక్ష అని విమర్శించిన తెరాసపై నామా నిప్పులు చెరిగారు.
రైతు బిడ్డలు తెలుగుదేశం పార్టీ వెంట ఉండకూడదనే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా అని నామా ప్రశ్నించారు. రైతు బిడ్డలు చదువుకోవాలన్నదే చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని నామా వెల్లడించారు.