కాంగ్రెస్ పార్టీ, కడప ఎంపీ పదవికి రాజీనామా చేసిన వై.ఎస్. జగన్మోహన రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తానే మొదటి సంతకం పెట్టానని విశాఖ జిల్లా యలమంచిలి శాసనసభ్యుడు కన్నబాబు(ఉప్పలపాటి వెంకటరమణరాజు) అన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కన్నబాబు స్పష్టం చేశారు.
కానీ కాంగ్రెస్‌లో ఉండాలా, జగన్ వైపు వెళ్లాలా అనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. కార్యకర్తల కోరిక మేరకే నడుచుకుంటానని కన్నబాబు అన్నారు.
ఒకవేళ కార్యకర్తలు కోరితే రాజీనామా సిద్ధమని కన్న వెల్లడించారు. అయితే విశాఖ జిల్లాలో జగన్ చేపట్టే ఓదార్పులో పాల్గొనని ఆయన స్పష్టం చేశారు. యలమంచిలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఆవిష్కరింప చేస్తామన్నారు.