గత యేడాది కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రాంతీయ ఉద్యమానికి, మత ఘర్షణలకు ముడిపెట్టవద్దని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి హితవు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. అందువల్ల పాత బస్తీలోని మత ఘర్షణల కేసులు, ఉద్యమ సమయంలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వేర్వేరుగా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు సంబంధించి హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటన చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేకేఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి కేసును పరిశీలించేందుకు సిద్ధంగా ఉందన్నారు. మత ఘర్షణ వంటి సున్నిత అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం సరికాదన్నారు. మత ఘర్షణలను, విద్యార్థుల కేసులను ఒకదానితో ఒకటి ముడిపెట్టరాదని ఆయన చెప్పారు.
అయితే, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ పాత బస్తీలలోని కేసులను అన్నింటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని పట్టుబట్టాయి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా విద్యార్థులపై కేసులు ఎత్తివేసి రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు.