Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్ని కేసులు ఎత్తివేస్తే కోర్టుకు వెళతాం: అక్బరుద్దీన్ హెచ్చరిక

అన్ని కేసులు ఎత్తివేస్తే కోర్టుకు వెళతాం: అక్బరుద్దీన్ హెచ్చరిక
, సోమవారం, 13 డిశెంబరు 2010 (12:27 IST)
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ప్రభుత్వం ఎత్తివేస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు వెళ్లి స్టే తెస్తామని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్ధీన్ ఓవైసీ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇలా చేస్తే తెలంగాణ మరో యేడాది పాటు వెనక్కి పోతుందన్నారు.

అదేసమయంలో ముస్లిం యువకులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని ఆయన కోరారు. సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై కేసులు ఎత్తేసినప్పుడు ముస్లిం యువకులపై పెట్టిన కేసులను కూడా ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై నమోదైన కేసులపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేసిన తర్వాత జరిగిన చర్చలో సోమవారం ఆయన పాల్గొని ప్రసంగించారు.

మతకలహాల సమయంలో ముస్లిం యువకులపై పెద్ద ఎత్తున కేసులు పెట్టారన్నారు. ఇవన్నీ అక్రమ కేసులేనన్నారు. మక్కా మసీదులో పెలుళ్లు చోటు చేసుకుంటే నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, తదితర జిల్లాల్లో ఉన్న ముస్లిం యువకులపై కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలన్నారు.

అంతేకాకుండా, హైదరాబాద్‌లోని పాతబస్తీ ముస్లిం యువకులు కూడా తెలంగాణ ప్రాంతం వారేనన్నారు. అందువల్ల తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేసినప్పుడు తెలంగాణలో పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజలను సంతోషపెట్టడానికి ప్రభుత్వం కేసులు ఎత్తేస్తోందని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఏ విధమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగని రీతిలో కేసుల ఉపసంహరణ ఉండాలని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu