Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభివృద్ధిలో ప్రాంతీయతత్వాలు విడనాడుదాం: కేకేఆర్ విజ్ఞప్తి

అభివృద్ధిలో ప్రాంతీయతత్వాలు విడనాడుదాం: కేకేఆర్ విజ్ఞప్తి
రాష్ట్రాభివృద్ధిలో ప్రాంతీయతత్వాలు విడనాడాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. అలాగే, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టు అవుతుందని ఇంతటి పటిష్టాత్మకమైన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత పుష్కరాలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకేఆర్ మాట్లాడుతూ.. అభివృద్ధి అంశాలకు సంబంధించి పార్టీల మధ్య విబేధాలు, ప్రాంతీయతత్వాలు ఉండరాదని ఈ భావనలు అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయన్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా వెనుకబడిందన్నారు. అందువల్ల ఈ జిల్లాలో పని చేసేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సాధ్యమైనంత తొందరలో జిల్లాను అభివృద్ధి పథాన నడిపేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ త్వరలో భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 28 వైద్యుల పోస్టులను కొత్తగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. 41 మెడికల్‌ ఆఫీసర్స్‌, 125 నర్సులకు పోస్టింగ్‌లు ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణానికి రూ.45 లక్షలను మంజూరు చేస్తున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు అత్యంతప్రతిష్టాత్మకమైనదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 38 వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని చెప్పారు. దీని ద్వారా 16 లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి ఒక లక్షా 56 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. ఇందుకోసం జిల్లాలో 7,600 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి టెండర్లను పిలిచారని, పనులు ఇన్వెస్టిగేషన్‌ దశలో ఉన్నాయని సీఎం వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu