Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిరణ్ కుమార్ పని పట్టాల్సిందే: సన్నిహితులతో రాయపాటి

కిరణ్ కుమార్ పని పట్టాల్సిందే: సన్నిహితులతో రాయపాటి
కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి వల్ల భవిష్యత్‌లో కమ్మవర్గానికి చెందిన నేతలు నోరు మెదపకుండా కూర్చోవాల్సి వస్తుందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తన సన్నిహితుల వద్ద వాపోయారు. దీన్ని ఆరంభంలోనే తుంచి వేయాలని లేకపోతే పార్టీ నుంచి లేదా రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

సీఎం కేకేఆర్ మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై రాయపాటి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పైపెచ్చు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము ఎలాంటి పనులు చేయించలేక పోతున్నామన్నారు. దీంతో ప్రజల ముందు తాము చేతగాని దద్దమ్మల్లా తయారవుతున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండి ఏం లాభమన్నారు. అందుకే త్వరలోనే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు.

రాష్ట్ర జనాభాలో రెడ్డి వర్గం జనాభా ఆరు శాతంగా ఉందని, కానీ, మంత్రివర్గంలో వారికి 13 శాఖలను, కమ్మ వర్గం జనాభా ఐదు శాతం ఉంటే కేవలం ఒకే ఒక్క శాఖను కేకేఆర్ కేటాయించి అవమానించారని రాయపాటి తన సన్నిహితులకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కమ్మ వర్గ నేతలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అంతేకాకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని మంత్రివర్గం నుంచి పక్కన పెట్టడంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా మెతకవైఖరిని అవలంభించడం, ప్రజలను నిర్లక్ష్యం చేసినట్టేనని రాయపాటి అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu