Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు: జగన్ యూత్

Advertiesment
జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు: జగన్ యూత్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు సత్యారెడ్డికి లేదని వైఎస్ఆర్ జిల్లా జగన్‌ యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.బాలు వ్యాఖ్యానించారు. జగన్ యువసేన అసోసియేషన్‌ అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న సత్యారెడ్డిని అసలు తామెన్నడూ చూడలేదని అన్నారు.

అసలు ఆ పదవికి ఆయనను ఎవరు నియమించారో తెలియదని, జగన్‌ తన ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యతానికి రాజీనామా చేయడం అందిరికీ తెలిసిన విషయమే అయినా.. ప్రత్యేకించి ఈ విషయాన్ని తనతో చర్చింలేదని సత్యారెడ్డి అనడం అర్థరహితంగా ఉందని బాలు అన్నారు.

గడచిన ఏడేళ్లుగా జగన్‌ యూత్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించామని, జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడి ఉంటామని బాలు చెప్పారు.

కాగా.. కాంగ్రెస్ పార్టీకి జగన్ రాజీనామా చేసే విషయం తమకు టీవీల్లో చూసే వరకు తెలియదని, జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై జగన్ అభిమానులు, యువసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, అందుకే జగన్ పేరిటగల "యువసేన"ను రద్దు చేస్తున్నట్లు సత్యారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu