Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేకేఆర్ కొత్త మంత్రివర్గం ఇదే!!

Advertiesment
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేకేఆర్ కొత్త మంత్రివర్గం ఇదే!!
రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొత్త మంత్రివర్గం బుధవారం కొలువుదీరింది. కిరణ్ మంత్రివర్గంలో మొత్తం 39 మందికి చోటు దక్కింది. వైఎస్ఆర్ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో ఆరుగురికి చోటు కల్పించలేదు. మంత్రి పదవులు దక్కనివారిలో గాదె వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.


కిరణ్ మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లుగానే మాజీ మంత్రి జానారెడ్డికి పదవి దక్కగా, జేసీ.దివాకర్‌రెడ్డికి మాత్రం మారోసారి మొండిచేయి చూపించారు. అలాగే చాలావరకూ తాజామాజీ మంత్రులను కొనసాగించడం గమనార్హం. త్వరలోనే చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో మరో ఎనిమిది మందికి చోటు లభించనున్నట్లు తెలుస్తోంది.

కొత్త మంత్రుల వివరాలు జిల్లాల వారీగా...
హైదరాబాద్... దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, శంకర్‌రావు.
రంగారెడ్డి... సబితా ఇంద్రారెడ్డి.
మెదక్... గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, సునీతా లక్ష్మారెడ్డి
నల్గొండ... జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కరీంనగర్... దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు
వరంగల్... బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య
నిజామాబాద్... సుదర్శన్‌రెడ్డి
ఖమ్మం... రాంరెడ్డి వెంకటరెడ్డి
మహబూబ్‌నగర్... డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు
గుంటూరు... మాణిక్య వరప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, కన్నా లక్ష్మీనారాయణ, కాసు కృష్ణారెడ్డి.
పశ్చిమగోదావరి... పీతాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్
తూర్పు గోదావరి... విశ్వరూప్, తోట నర్సింహా
శ్రీకాకుళం... ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు
విజయనగరం... బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం... బాలరాజు
కృష్ణ... పార్థసారథి
నెల్లూరు... ఆనం రామనారాయణరెడ్డి
ప్రకాశం... మహిధర్‌రెడ్డి
అనంతపురం... శైలజానాథ్, రఘువీరారెడ్డి
కర్నూలు.... టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా... వైఎస్.వివేకానందరెడ్డి, డీఎల్.రవీంద్రరెడ్డి, అహ్మదుల్లా.
ఆదిలాబాద్: జిల్లా నుంచి ఎవరికీ ప్రాతినిథ్యం లభించలేదు.

Share this Story:

Follow Webdunia telugu