కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన రాజీనామా రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది ఇతర పార్టీలపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సినీ నటుడు చిరంజీవి అధ్యక్షుడిగా ఉన్న ప్రజారాజ్యం పార్టీ కార్యాలయాలకు గట్టి భద్రత కల్పించారు.
కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ నుంచి ప్రభుత్వానికి ఎపుడైనా ముప్పు పొంచివుంటుందని భావించిన కాంగ్రెస్ పెద్దలు ఆ పార్టీని ప్రభుత్వంలో చేర్చుకునేందుకు సమ్మతించారు. దీన్ని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి వంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు తీవ్రంగా, బహిరంగానే వ్యతిరేకించారు.
ప్రజారాజ్యం పార్టీకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే తనతో పాటు.. మరో ముగ్గురు ఎంపీలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సబ్బం హరి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజారాజ్యం పార్టీ కార్యాలయాలకు భద్రత కల్పించారు.
జగన్ వర్గీయులతో పాటు.. ప్రరాపాకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది.