బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి రోశయ్య రాజీనామా సమర్పించారు. ఈ రాజీనామాపై విపక్షాలు ఏదో ఒకటి మాట్లాడేవి. అటువంటిది విపక్ష నాయకులు నోరే మెదపడం లేదు.
తెలంగాణాకోసం పోరాటం బాటపట్టిన తెరాస చీఫ్ కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తే... ఆయన కూలి పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది. డిసెంబరు 9న వరంగల్ జిల్లాలో తలపెట్టనున్న మహాగర్జనకై నిధుల సమీకరణలో భాగంగా ఆయన ఈ కూలి పని చేస్తున్నట్లు కేసీఆర్ సన్నిహితులు చెప్పుకొచ్చారు.
ఇక ప్రధానప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం నుంచి మీడియా కంటికి కనిపించలేదు. రైతులు, సమస్యలు, 2జీ స్పెక్ట్రమ్.. వగైరా.. వగైరాలపై నిన్న రాత్రివరకూ మాట్లాడిన బాబు ఈ ఉదయం నుంచి సైలెన్స్ మోడ్‌లో ఉండిపోయారు. బహుశా: సీఎల్పీ సమావేశం ముగిశాక.. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక జరిగాక ఆయన మీడియా ముందుకు వస్తే రావచ్చని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.
ఇకపోతే చిరంజీవి... రోశయ్య రాజీనామా వార్తతో నిరుత్సాహంగా ఉన్నట్లు సమాచారం. ఇదీ విపక్షాల పరిస్థితి.