పనిభారం, వయోభారం వల్లే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రోశయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. గవర్నర్ నరసింహన్ రోశయ్య రాజీనామాను ఆమోదించారు.
అయితే.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే వరకూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని రోశయ్యకు గవర్నర్ సూచించినట్టు తెలుస్తోంది. కాగా.. రాజ్‌భవన్‌కు రోశయ్య వెంట మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీధరబాబులు కూడా ఉన్నారు.
ఇదిలా ఉండగా.. రోశయ్య తర్వాత సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా నెలకొని ఉంది. కాగా.. సీఎం రేసులో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈయనతోపాటు శాసనసభ స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ హోంమంత్రి జానా రెడ్డి, రాష్ట్ర మంత్రి గీతారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే.. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని మాత్రం రెడ్డి కులస్తులకే కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రిని నేనే అని తన సన్నిహితులతో జైపాల్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. దీంతో దాదాపు ఆయననే ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు ఆయనను కలిసి అభినందలు తెలియజేస్తున్నారు.