Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సభకు ఎంపీలంతా రావాలి.. సోనియా: పట్టించుకోని జగన్

సభకు ఎంపీలంతా రావాలి.. సోనియా: పట్టించుకోని జగన్
2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో పార్లమెంటు దద్దరిల్లిపోతోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలందరూ సభకు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు. సభకు రానివారిపై నిబంధనలను అనుసరించి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఓదార్పు యాత్రే తనకు ముఖ్యమని చెప్పే వైఎస్ జగన్ సోనియా మాటలను పట్టించుకుంటారా..? ఒకవేళ పట్టించుకోకుండా సభకు వెళ్లకపోతే ఏం జరుగుతుంది..? జగన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా...? అలా తీసుకోవడం తమకు కావలని వైఎస్సార్ వర్గీయులు తలపోస్తున్నట్లు భోగట్టా.

ఇలా జగన్‌పై అధిష్టానం చర్య తీసుకుంటే ప్రజల్లో జగన్‌కు సానుభూతి పెరుగుతుందని, దాని ద్వారా వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలను మట్టికరిపించే జగన్ సంచలన విజయం సాధించడం ఖాయమని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. నిజమేనా..?!!

Share this Story:

Follow Webdunia telugu