కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. రాష్ట్రంలో మరిన్ని సంస్కరణ కార్యక్రమాలు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని రోశయ్య పేర్కొన్నారు. ఇప్పటికే నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నామని, ఇంకా పలు సంస్కరణల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
గురువారం మెదక్ జిల్లాలో పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి, సంగారెడ్డిలో 27 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కలక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకుగాను కొత్త కలెక్టరేట్‌లో కొలువుతీరనున్న 38 ప్రభుత్వ శాఖలు తీవ్రంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.