రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డిపై చూపించే శ్రద్ధ, రాష్ట్ర కాంగ్రెస్‌పై చూపిస్తే బాగుంటుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మొయిలీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై శ్రద్ధ చూపించకపోవడంతోనే పార్లమెంట్ సభ్యుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయని గోవర్ధన్ గిరి చెప్పారు.
ఇప్పటికైనా మొయిలీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై శ్రద్ధ చూపి నేతల మధ్య సమన్వయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో పార్లమెంటు సభ్యుల మధ్య సమన్వయ లోపానికి మా పార్టీ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలే కారణమన్నారు.
డబ్బులు సంపాదించేందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు తెలుగుదేశం పార్టీ నేతలతు కుమ్మక్కయి ప్రాజెక్ట్ కాంట్రాక్టులు దక్కించుకుని పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని పాల్వాయి ఆరోపించారు. పోలవరం ఇప్పటి డిజైన్ సరికాదని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇప్పటి డిజైన్ మారిస్తేనే అది పూర్తవుతుందన్నారు.