Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డీజీపీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: దత్తన్న

Advertiesment
డీజీపీ
, శుక్రవారం, 15 జనవరి 2010 (15:17 IST)
తెలంగాణ ఉద్యమంపై రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. దీనికి నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ శుక్రవారం రాజధానిలోని గన్ పార్కు వద్ద ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. డీజీపీ వైఖరిని ఖండించారు. గిరీష్ కుమార్ వ్యక్తిగతంగా మంచివారైనప్పటికీ ఆయన రాజకీయ పార్టీ నేతగా ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అందువల్ల ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

ఇకపోతే.. రాజీనామాల అంశంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజీనామాలను ఉపసంహరించుకున్న వారు తమ వైఖరిని వెల్లడించాలని కోరారు.

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్లు ఉన్నట్ట వ్యాఖ్యానించారు. ప్రధానంగా.. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు వల్ల మావోయిస్టుల పట్టుసాధిస్తారని అన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu