గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు.. విద్య, వైద్య, ఆరోగ్యం తదితర సౌకర్యాల రూపకల్పనపై దృష్టిసారించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో ముఖ్య అతిథిగా బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగింస్తూ.. దేశాభివృద్ధి మానవవనరుల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
ఒక మంచి నాయకుడు దేశాన్ని మార్చితే ఒక వ్యాపార వేత్త కంపెనీ స్థితిగతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతాడని చెప్పారు. పాలనా వ్యవస్థ నిర్వీర్యమైతే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయే మన రాష్ట్రంలో సంభవించిన వరదలే ప్రత్యక్ష ప్రసారమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం ప్రభుత్వం పనితీరు స్తంభించి పోయిందన్నారు. కాగా, ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, రక్షణ, సైనిక అధికారులు పాల్గొన్నారు.