Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాశ్వత నిద్రకు స్వయంగా స్థలాన్ని ఎంచుకున్న వైఎస్

శాశ్వత నిద్రకు స్వయంగా స్థలాన్ని ఎంచుకున్న వైఎస్
, శనివారం, 5 సెప్టెంబరు 2009 (15:17 IST)
File
FILE
యాదృచ్ఛికమో.. ఏమోగానీ.. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి.. తాను శాశ్వతంగా ఎక్కడ నిద్ర పోవాలో కూడా ముందుగానే నిర్ణయించుకున్నారు. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఇడుపులపాయ ఎస్టేట్‌లో వైఎస్ తన కుమార్తె, కుటుంబ సభ్యులతో కలిసి విహరించడం పరిపాటి. ఏ కొద్దిపాటి సమయం చిక్కినా ఆయన నేరుగా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అక్కడ కంటినిండా కునుకు తీయడం పరిపాటి.

అలా.. ఒకరోజున తన ముద్దుల కుమార్తె షర్మిళతో ఎస్టేట్‌లో వాకింగ్ చేస్తుండగా.. "నేను చనిపోతే ఇక్కడే పాతిపెట్టండి" అని యాదృచ్ఛికంగా చెప్పారట. అంతేకాకుండా, తనను పాతి పెట్టాల్సిన ప్రదేశాన్ని (స్థలం) స్వయంగా వైఎస్సార్ చూపించారట. ఆయన కోర్కె మేరకు కుమార్తె పట్టుబట్టి ఇడుపులపాయ ఎస్టేట్‌లో వైఎస్‌ శాశ్వత నిద్రపోయేలా అంత్యక్రియలు చేశారు.

వైఎస్ దుర్మరణ వార్త తెలిసిన వెంటనే.. ఆయన అంత్య క్రియలు సొంతూరు బలపనూరులో జరుగుతాయని కొందరు, పులివెందులలో జరుగుతాయని మరికొందరు.. వైఎస్ తండ్రి రాజారెడ్డి పక్కనే పాతిపెడతరాని ఇంకొందరు ఇలా వ్యాఖ్యానించారు.

అయితే, తండ్రి వైఎస్ తనతో ఒకానొక సందర్భంలో చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకున్న కుమార్తె షర్మిళ.. నాన్న అప్పట్లో అనుకోకుండా వెల్లడించిన ప్రదేశంలోనే దహన సంస్కారాలు చేయాలని పట్టుబట్టిందట. కాగా, ప్రస్తుతం ఈ ఎస్టేట్ కార్యకలాపాలను షర్మిళ పర్యవేక్షిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu