Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ ప్రయాణించిన విమానం డొక్కుది!

వైఎస్ ప్రయాణించిన విమానం డొక్కుది!
, బుధవారం, 2 సెప్టెంబరు 2009 (18:45 IST)
File
FILE
తన పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఎంచుకున్న హెలికాఫ్టర్ పురాతన కాలానికి చెందినదని పౌరవిమానయాన విభాగం డైరక్టర్ తేల్చి చెప్పారు. భెల్-430 రకం ఈ విమానం.. గత రెండు సంవత్సరాలుగా రెన్యువల్ కూడా చెయించుకోలేదని ఆయన బుధవారం వెల్లడించారు.

ముఖ్యమంత్రి అదృశ్యమై ఎనిమిది గంటలుపైగా అవుతున్నా ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ డొక్కుదని వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన విభాగం డైరెక్టర్ వెల్లడించిన వివరాల మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ ప్రయాణించే భెల్-430 హైలికాఫ్టర్ చాలా పాతదని, దానికి లైసెన్సు కూడా రెన్యువల్ కాలేదని తెలిసింది. దీనిని వినియోగించరాదని గతంలోనే తాము సూచించామని తెలిపారు.

అయితే తక్కువ ఖరీదుకు వచ్చిందన్న ఒకే ఒక్క కారణంగా ప్రభుత్వం ఈ హెలికాఫ్టర్‌ను కాదనలేక పోయిందని, దీన్నే ముఖ్యమంత్రి తన పర్యటనల కోసం వినియోగిస్తున్నట్టు సమాచారం. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్నే వినియోగిస్తూ వస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu