Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏప్రిల్ నుంచి రూ. 2 బియ్యం: వైఎస్

Advertiesment
ఏప్రిల్ నుంచి రూ. 2 బియ్యం: వైఎస్
తిరుపతి (ఏజెన్సీ) , గురువారం, 11 అక్టోబరు 2007 (08:43 IST)
వచ్చే సంవత్సరం జనవరి లేదా ఏప్రిల్ మాసం నుంచి రెండు రూపాయలకే కిలో బియ్యం పధకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారందరికీ పై పధకాన్ని వర్తింపచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశాల ప్రారంభం నిమిత్తం చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం వైఎస్ పర్యటించారు. మరో రెండేళ్ళలో రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్ళు అందిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

డ్వాక్రా గ్రూపులకు రూ. 7,500 కోట్ల మేరకు రుణాలు, బడుగు బలహీన వర్గాలకు ప్రత్యామ్నాయ ఆదాయ కల్పనలో భాగంగా పశుక్రాంతి పధకం ద్వారా పశువులను పంపిణీ చేస్తామని వైఎస్ హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu