భారత్, చైనా దేశాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఆసియా, పసిఫిక్ రీజియన్‌లపై దృష్టి సారించినట్టు ఫిలిప్స్ కంపెనీ వెల్లడించింది. దీనిపై ఫిలిప్స్ లైటింగ్ ఆసియా రీజినల్ డైరక్టర్ నిజెల్ డి అక్రీ మాట్లాడుతూ తమ ఉత్పత్తి విక్రయాలకు భారత్-చైనాల్లో మంచి ఆదరణ ఉందన్నారు. ఈ వృద్ధి రేటును ఇదేవిధంగా కొనసాగించేందుకు వీలుగా ఆసియా, పసిఫిక్ రీజియన్ మార్కెట్‌పై దృష్టి సారించినట్టు తెలిపారు.
ప్రధానంగా ఆసియా మార్కెట్‌లో లెడ్ వస్తు ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా లెడ్ లైట్ మార్కెట్ ఒక బిలియన్ యూరోలుగా ఉన్నట్టు ఉందన్నారు. ఇది వచ్చే 2015 నాటికి 12 బిలియన్ యూరోలకు చేరుకోవచ్చని ఆయన తెలిపారు.