ఆహార ద్రవ్యోల్బణం సూచీలో వరుసగా రెండు వారాలు తగ్గుదల కనిపించినప్పటికీ.. క్రమంగా జనవరి 15వ తేదీతో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం 15.57 శాతంగా నమోదైంది. జనవరి ఎనిమిదో తేదీతో ముగిసిన వారాంతానికి పోల్చుకుంటే 0.5 శాతం మేరకు పెరిగింది. గత వారంలో 15.52 శాతంగా నమోదైనప్పటికీ.. కూరగాయలు ప్రధానంగా ఉల్లిపాయల ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల స్వల్పంగా పెరిగింది.
ఆహార ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంది. అయితే, ఆహార ద్రవ్యోల్బణ సూచీకి బ్రేకులు వేసేందుకు కేంద్రం పలు రకాల చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించింది. అయినప్పటికీ.. సూచీలో తగ్గుదల కనిపించక పోవడం గమనార్హం. వారాంతపు సమీక్ష ప్రకారం కూరగాయల ధరల్లో 67.07 శాతం మేరకు పెరిగినట్టు తెలుస్తోంది.