Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెట్రోల్ ధరల పెంపుపై మండిపడిన మమతా బెనర్జీ

Advertiesment
పెట్రోల్ ధరల పెంపుపై మండిపడిన మమతా బెనర్జీ
పెట్రో వడ్డనపై కేంద్రంలోని యూపీఏ సర్కారు భాగస్వామ్య పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కోల్‌కతా బీబీ, కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

పెట్రో ధరలను పెంచే అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం తమను మాటమాత్రమైనా సంప్రదించలేదని ఆమె వాపోయినట్టు సమాచారం. దీనిపై ఆ పార్టీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ మీడియాతో మాట్లాడుతూ పెట్రో భారాన్ని నిరశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు పిలుపునిచ్చినట్టు చెప్పారు.

ఈ ఆందోళనలు 17, 18 తేదీల్లో కొనసాగుతాయన్నారు. పెట్రో ధరలను పెంచే ముందుకు తమను మాట మాత్రమైన సంప్రదించలేదన్నారు. ఇదిలావుండగా, బెంగాల్‌లో అధికార పార్టీ సీపీఎం ట్రేడ్ విభాగమైన సీఐటీయూ కూడా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

కాగా, పెట్రో ధరలపై నియంత్రణ ఎత్తివేసి తర్వాత గత నెల కాలంలో పెట్రో ధరలను రెండు సార్లు పెంచింది. గత డిసెంబరు 15వ తేదీన ఒకసారి పెంచగా, ఈనెల 15వ తేదీన మరోమారు లీటరుకు రూ.2.94 నుంచి రూ.2.96 చొప్పున చెంపుతూ నిర్ణయం తీసుకుంది. గత ఆరు నెలల కాలంలో ఇంత మొత్తంలో పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu