కొత్త సంవత్సరంలో కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. కొత్త సంవత్సరం రోజే ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ దాదాపు అన్ని రకాల వాహనాలపై రేట్లను పెంచింది.
వాణిజ్య వాహనాలపై రూ. 1,500 నుండి రూ. 30,000 వరకూ, పాసింజర్ కార్ల విభాగంలో రూ. 3,000 నుండి రూ. 15,000 వరకూ, యుటిలిటీ విభాగంలో రూ. 8,000 నుండి రూ. 14,500 వరకూ వాహనాలపై ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి రానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఉక్కు, రబ్బర్ వంటి ముడి సరుకుల ధరలు పెరగడంతో కొంత భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని కంపెనీ పోర్కొంది.