రానున్న పదేళ్లలో భారత్‌లో ఉద్యోగాలు లభించనున్నాయి. 2020 నాటికి భారత్‌లో 50 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దే దిశగా ఈ నియామకాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
"రానున్న పదేళ్లలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు 50 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయ"ని హౌరా జిల్లాలోని బగ్నాన్‌లోని ఓ పాఠశాల భవన నిర్మాణానికి పునాదిరాయి ప్రతిస్టించిన అనంతరం అన్నారు. భారతదేశ జనాభాలో మూడొంతుల జనాభా 35 ఏళ్లలోపు వారు ఉన్నారు. వీరిక సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే భారత్ ప్రపంచానికే మానవ వనరుల నిధిగా మారుతుంది.