దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్‌లో ప్రైవేట్ సంస్థలు నాలుగు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పనున్నాయి. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గాను ఈ ప్లాంట్ల నిర్మాణం చేపట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
యూపీ చీఫ్ సెక్రటరీ అతుల్ కుమార్ గుప్తా నేతృత్వంలో జరిగిన ఎనర్జీ టాస్క్ ఫోర్స్ (ఈటీఎఫ్) సమావేశంలో 3480 మెగావాట్‌లో సామర్థ్యం కలిగిన నాలుగు థర్మల్ ప్రాజెక్టులను వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాలని ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ నాలుగు ప్రాజెక్టుల్లో 1980 మెగావాట్‌ల సామర్థ్యం కలిగిన ఒక ప్లాంట్‌ను బజాజ్ హిందుస్థాన్ సంస్థ చిత్రకూట్ జిల్లాలోని బర్గరహ్ ప్రాంతంలో నెలకొల్పనుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌ను యూపీకే సరఫరా చేస్తారు.
మిగిలిన వాటిలో ఒక్కొక్కటి 250 మెగావాట్‌ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్లాంట్లను పరీఖ్ అల్యూమినియం లిమిటెడ్, యూనిటెక్ మిషన్స్ లిమిటెడ్‌లు పరుఖ్‌బాద్, అరాయా జిల్లాల్లో నెలకొల్పుతాయి.