Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ-టీఎన్‌లలో రూ.1247 కోట్ల ప్రాజెక్టులకు అనుమతి

ఏపీ-టీఎన్‌లలో రూ.1247 కోట్ల ప్రాజెక్టులకు అనుమతి
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో 1,247 కోట్ల రూపాయల విలువ గల వివిధ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో ఈ రెండు రాష్ట్రాల్లో మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను చేపడుతారని కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలిపారు.

దీనిపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో దిండివనం-కృష్ణగిరి సెక్షన్‌లో 178 కిలోమీటర్ల దూరంగల రోడ్డు మార్గం నిర్మాణం పనులకు కేబినెట్ కమిటీ ఆన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీసీఐ) అనుమతి ఇచ్చిందన్నారు. ఈ రోడ్డు మార్గాన్ని డీబీఎఫ్ఓటీ విధానం కింద పూర్తి చేస్తారన్నారు.

సీసీఐ ఆమోదముద్ర వేసిన ఇతర ప్రాజెక్టుల్లో విశాఖపట్నం పోర్టులో రెండు థర్మల్ కోల్ బెర్తులను అభివృద్ధి చేస్తారన్నారు. వీటిలో ఒక్కొక్క ప్రాజెక్టుకు రూ.328.18 కోట్లు, రూ.313.39 కోట్లు చొప్పున వెచ్చించనున్నట్టు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా డీబీఎఫ్‌ఓటీ విధానం కిందనే వచ్చే 24 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu