Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

పాండవులకు హస్తినాపురం పొలిమేరలో పాలపిట్ట కనిపించిందట.. ఈ దసరాకు?

దసరా పండుగ వేళ పాలపిట్టను దర్శించుకోవడం ద్వారా నమస్కరించడం ద్వారా శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

Advertiesment
Indian roller bird
, ఆదివారం, 7 అక్టోబరు 2018 (14:48 IST)
దసరా పండుగ వేళ పాలపిట్టను దర్శించుకోవడం ద్వారా నమస్కరించడం ద్వారా శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పాలపిట్ట దేవీ స్వరూపమని, అది ఉత్తర దిక్కునుంచి వస్తే శుభం, విజయం కలుగుతాయి. దక్షిణ దిశగా వస్తే అశుభ సంకేతమని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తుంటారు. 
 
తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఒడిస్సా, బీహార్‌ల రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందినా పట్టణీకరణ మూలంగా పాలపిట్ట జాడ కనుమరుగవుతోంది. సెల్ టవర్స్ వల్ల కూడా ఈ పాల పిట్టలు కనుమరుగు అవుతున్నాయి. పచ్చని చెట్లు పెంచటం ద్వారానే ఈ పరిస్థితిని నివారించగలం. అప్పుడే శుభాలనిచ్చే పాలపిట్టనూ కాపాడుకోగలం. 
 
తెలంగాణ ప్రాంతంలో దసరా పండగ నాటి సాయంత్రం శమీపూజ ఎంత ముఖ్యమో, పొలానికి వెళ్లి ఈ పక్షిని చూసి మొక్కి రావటం అంతే ముఖ్యమని ఆధ్యాత్మిక నిపుణులు తెలిపారు. దసరా రోజే దీన్ని ఎందుకు చూడాలంటే.. అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకొని వస్తున్న పాండవులకు హస్తినాపురం పొలిమేరలో ఈ పాలపిట్ట కనపడిందట.
 
అప్పటి నుంచి వారిని అన్నీ విజయాలే సిద్ధించాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. నాటి నుంచి దసరా నాడు పాలపిట్ట దర్శనం చేసుకునే ఆచారం వుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
నవరాత్రులు - నైవేద్యాలు 
తొలి రోజు - పాడ్యమి - కట్టుపొంగలి
రెండవ రోజు - విదియ- పులిహోర
మూడవ రోజు - తదియ - కొబ్బరి అన్నం
నాలుగవ రోజు - చవితి - గారెలు
ఐదవ రోజు - పంచమి - పెరుగు అన్నం
ఆరవ రోజు - షష్టి - కేసరి బాత్
ఏడవ రోజు - సప్తమి - శాకాన్నము
ఎనిమదవ రోజు - అష్టమి - చక్కెర పొంగలి
తొమ్మిదవ రోజు - నవమి - పాయసం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-10-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. రావలసిన ధనం చేతికందటంతో?