Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఒత్తిడి తట్టుకోలేక ముఖ్యమంత్రి రాజీనామా? ఎప్పుడంటే?

ఆ ఒత్తిడి తట్టుకోలేక ముఖ్యమంత్రి రాజీనామా? ఎప్పుడంటే?
, శనివారం, 12 జూన్ 2021 (21:34 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పదవి గండం పొంచి ఉందా? ఆయనను తప్పించాలని అధిష్టానం నిర్ణయించిందా.. అందుకే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించనున్నారా?
 
కర్ణాటక బిజెపి సీనియర్ నేత సిఎం యడ్యూరప్ప తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆయనను పీఠం నుంచి తొలగించాలని పలువురు బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై పది రోజుల నుంచి డిమాండ్ ఊపందుకుంది. యడ్డి రాజీనామా చేయాలన్న సీనియర్ నేతలను బుజ్జగించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పర్యటించబోతున్నారు.
 
ఈ నెల 17, 18వ తేదీల్లో అరుణ్‌ సింగ్ కర్ణాటకలో పర్యటించబోతున్నారట. కర్ణాటకలో సిఎం మార్పును అరుణ్ సింగ్ కొట్టిపడేశారట. యడ్యూరప్ప పనితీరు బేషుగ్గా ఉందని... కోవిడ్-19ను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారని ప్రశంసించారు. యడ్యూరప్ప పనితీరుపై అధిష్టానం కూడా సంతృప్తిగా ఉందని సిఎం మార్పు లేదని స్పష్టం చేశారు.
 
ఆయనే పూర్తికాలం సిఎంగా ఉంటారని వివరించారు అరుణ్ సింగ్. జూన్ 17వ తేదీన తాను బెంగుళూరు వెళ్ళి అసమ్మతి ఎమ్మెల్యేల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. నాయకత్వ మార్పుపై ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు. మార్పు ఉండబోదని అరుణ్ సింగ్ చెబుతున్నప్పటికీ వచ్చేవారం బెంగుళూరు వెళ్ళి అసంతృప్తులను  బుజ్జగిస్తారని చెప్పడంతో యడ్డి ఊపిరి పీల్చుకున్నారట.
 
అయితే అరుణ్ సింగ్‌కు తేల్చి చెప్పి యడ్యూరప్ప రాజీనామా చేయాలని మాత్రం పట్టుబడితే ఇక ఖచ్చితంగా చేయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చేశారట యడ్యూరప్ప. త్వరలోనే తన పదవికి రాజీనామా చేయడం ఖాయమని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగం పేరిట వాడేసుకున్నారు.. ఆ వీడియో సీఎం జగన్ వరకు వెళ్ళాలి..?