Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తతో అక్రమ సంబంధం... అనుమానంతో చిన్ననాటి స్నేహితురాల్ని చెరువులో తొక్కి చంపేసింది...

తను కట్టుకున్న భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో ఓ యువతి తన చిన్ననాటి స్నేహితురాలిని పథకం ప్రకారం హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జైపూర్ లోని చురు అనే ప్రాంతానికి చెందిన మనీషా సైన్యంలో పనిచేసే ఓ యువకుడిని పెళ్లా

Advertiesment
Women killed
, గురువారం, 17 నవంబరు 2016 (12:39 IST)
తను కట్టుకున్న భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో ఓ యువతి తన చిన్ననాటి స్నేహితురాలిని పథకం ప్రకారం హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జైపూర్ లోని చురు అనే ప్రాంతానికి చెందిన మనీషా సైన్యంలో పనిచేసే ఓ యువకుడిని పెళ్లాడింది. ఐతే తన ప్రాణ స్నేహితురాలు బబితను కూడా తరచూ ఇంటికి ఆహ్వానిస్తుండేది. బబిత అలా వస్తూ... తన భర్తతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. 
 
తన స్నేహితురాలు బబిత-భర్తను నిశితంగా గమనించిన మనీషాకు వాళ్లిద్దరిపై అనుమానం వచ్చింది. ఇద్దరూ అక్రమ సంబంధం సాగిస్తున్నారన్న అనుమానంతో ఆమెను చంపేందుకు ప్లాన్ చేసింది. తన భర్త వస్తున్నాడు బస్టాండుకు వెళ్దామా అని అడిగి తోడు రమ్మన్నట్లు అభ్యర్థించింది. ఇది నిజమే అని నమ్మిన బబిత ఆమె వెంట వెళ్లింది. ఐతే బస్టాండుకు సమీపంలో ఓ చెరువు వద్దకు తీసుకెళ్లి కావాలని ఓ ఉంగరాన్ని ఆ చెరువులో పడేసింది. గబుక్కున చేయి జారి ఉంగరం చెరువులో పోయిందనీ, అది తన ఎంగేజ్ మెంట్ ఉంగరమని చెప్పి, దాన్ని వెతికి తీయాలని స్నేహితురాలిని అభ్యర్థించింది. 
 
చెరువు లోతు ఎక్కువగా ఉందని ఆమె చెప్పినా... ఫర్లేదు నీకు నేను తాడు కట్టి పట్టుకుంటానని చెరువులో దించేసింది. ఆమె చెరువులో చేరి ఉంగరం కోసం నీటిలో మునగగానే వెంటనే అక్కడికి వెళ్లి తన కాళ్లతో ఆమెను నీటిలోనే తొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత తకను ఏమీ తెలియనట్లు వెళ్లిపోయింది. మళ్లీ తనే తన మిత్రురాలు ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయి చనిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తనే హత్య చేసినట్లు అంగీకరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద మొసళ్లు బతికిపోయి, చిన్న చేపలు చచ్చిపోయాయి.. నోట్ల రద్దుపై అట్టుడికిన రాజ్యసభ..