Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ భర్త భార్యపై గ్యాంగ్ రేప్ చేయించిన మహిళ

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మాజీ భర్త భార్య (సవతి)పై ఓ మహిళ సామూహిక అత్యాచారం చేయించింది. ఇందుకోసం ఆ మహిళ కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్

Advertiesment
Haryana
, శనివారం, 22 సెప్టెంబరు 2018 (16:31 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మాజీ భర్త భార్య (సవతి)పై ఓ మహిళ సామూహిక అత్యాచారం చేయించింది. ఇందుకోసం ఆ మహిళ కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హర్యానా రాష్ట్రంలోని అంబాలాకు చెందిన ఓ వ్యక్తి మనస్పర్థలు కారణంగా తొలి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మరో మహిళను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఈయన తన రెండో భార్యతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దీన్ని తొలి భార్య జీర్ణించుకోలేక పోయింది. ఎలాగైనా తన మాజీ భర్త కాపురాన్ని కూల్చాలని తన కుంటుంబంతో కలిసి పథకం రచించింది. 
 
కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడి ఇంటిపై దాడి చేసిన సదరు మహిళ.. భార్యభర్తలను కిడ్నాప్‌ చేసి.. రెండు వేర్వేరు వాహనాల్లో వారిని పానిపట్‌కు తరలించారు. తన మాజీ భర్తకు విడాకులు ఇవ్వాలని బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె అంగీకరించక పోవడంతో తీవ్రంగా కొట్టడమే కాకుండా ఆమెపై సామూహిక అత్యాచారానికి ఉసిగొల్పింది. వారి చెర నుంచి బయటపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. జనసేన పార్టీని జెండా ఎగురవేస్తా... ఎవరు?