Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరువు ప్రాంత రైతులు చస్తున్నా సాయం చేయరా? నిగ్గదీసిన సుప్రీంకోర్టు

పంటల వైఫల్యం, రుణభారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సహాయార్థం ఇంతవరకు ఒక జాతీయ పాలసీ ఎందుకు లేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్లికా సారాబాయి నేతృత్వంలోని ఎన్జీవో మూడేళ్ల క్రితం దాఖలు చేసిన అప్పీలుపై విచారణ చేపట్టి చీప్ జస్టిస్ జె.ఎస్ ఖ

Advertiesment
కరువు ప్రాంత రైతులు చస్తున్నా సాయం చేయరా? నిగ్గదీసిన సుప్రీంకోర్టు
హైదరాబాద్ , శనివారం, 28 జనవరి 2017 (08:39 IST)
పంటల వైఫల్యం, రుణభారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సహాయార్థం ఇంతవరకు ఒక జాతీయ పాలసీ ఎందుకు లేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్లికా సారాబాయి నేతృత్వంలోని ఎన్జీవో మూడేళ్ల క్రితం దాఖలు చేసిన అప్పీలుపై విచారణ చేపట్టి చీప్ జస్టిస్ జె.ఎస్ ఖెహర్, జస్టిస్ ఎన్ వి రమణలతో కూడిన ధర్మాసనం దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పంట విఫలం నుంచి రైతులను కాపాడే జాతీయవిధానం ఇంతవరకు దేశంలో ఎందుకు లేదంటూ ప్రశ్నించింది. 2004-2012 మధ్యకాలంలో గుజరాత్‍‌లో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో రైతులకు ఉపశమనం కలిగించాలంటూ సారాబాయి నేతృ్వంలోని ఎన్జీఓ దాఖలు చేసిన పిల్‌ను విచారించరాదని గుజరాత్ హైకోర్టు తీసుకున్న నిర్ణయంలోని హేతుబద్ధతపై సుప్రీం కోర్టు విచారస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పంటల  వైఫల్యం సందర్భంగా రైతులకు పరిహారం చెల్లించే జాతీయ పాలసీ తప్పకుండా ఉండాలని సూచించారు. ఇది నిజంగా జాతీయ సమస్యేనని, పైగా విశాల ప్రజానీకానికి చెందిన సమస్య అన్న ఆయన అబిప్రాయంతో పిటిషనర్ కౌన్సిల్, గుజరాత్ ప్రభుత్వ కౌన్సిల్ ఇద్దరూ ఏకీభవించారు. 
 
సుప్రీంకోర్టు ధర్మాసనం మల్లికా సారాబాయి అభ్యర్థనను పిల్‌గా మార్చాలని నిర్ణయించింది. కేంద్రానికి, రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్కే బీచ్‌లో ఆత్మగౌరవ నిరసన: మార్చిలో అంటున్న పవన్