జవాన్లు చనిపోతే లెఫ్టిస్టులు పండగ చేసుకుంటారా.. గాంధీని చంపాక ఎవరు పండగ చేసుకున్నారో?
ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి స్వచ్చందంగా పోరు విరమించిన గుర్ మెరహ్ కౌర్‌పై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు విమర్శలు ఆపడం లేదు. ‘మన జవాన్లు విధుల్లో చనిపోతే వేడుక చేస
ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి స్వచ్చందంగా పోరు విరమించిన గుర్ మెరహ్ కౌర్‌పై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు విమర్శలు ఆపడం లేదు. ‘మన జవాన్లు విధుల్లో చనిపోతే వేడుక చేసుకునే వారు కౌర్‌ను తప్పుదారి పట్టిస్తున్నారు.. ఆమె తండ్రి ఆత్మ తప్పకుండా క్షోభిస్తూ ఉంటుంది’ అని అన్నారు. ‘జవాన్లు చనిపోతే లెఫ్టిస్టులు పండగ చేసుకుంటారు. వర్సిటీల్లో్ల యువతను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని ఆరోపించారు.
రిజిజు విమర్శలను సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ‘‘గాంధీని చంపాక ఎవరు పండుగ చేసుకున్నారు ‘గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ కార్యకర్తలు సంతోషంతో స్వీట్లు పంచారు’ అని పటేల్(తొలి హోం మంత్రి)..గోల్వార్కర్(ఆరెస్సెస్)కు 11–09–1948న చెప్పా రు’’ అని ఏచూరి ట్వీట్ చేశారు.