Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బర్త్ డే పార్టీకి పిలిపించి.. గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు.. చివరికి?

స్నేహితులే తోటి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బర్త్ డే పార్టీ కంటూ పిలిపించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్‌లోని ద

Advertiesment
బర్త్ డే పార్టీకి పిలిపించి.. గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు.. చివరికి?
, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:09 IST)
స్నేహితులే తోటి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బర్త్ డే పార్టీకి పిలిపించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా, రత్తాల ప్రాంతానికి చెందిన నిందితుడు తన అంకుల్ ఇంట్లో బర్త్ డే ఫంక్షన్‌కు రావాల్సిందిగా 12వ తరగతి చదువుతున్న తన తోటి విద్యార్థినిని ఆహ్వానించాడు. 
 
ఆ ఇంటి కుటుంబ సభ్యులు వేరే కార్యక్రమానికి వెళ్లడంతో ఇంట్లో ఎవ్వరూ లేరు. పార్టీ కోసం ఆ సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లగా ఆమె స్నేహితుడు మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతున్నాడు. ఆమె రావడంతో మద్యంలో డ్రగ్స్ కలిపి తోటి విద్యార్థినితో బలవంతంగా తాగించాడు. అంతే స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థినిపై నలుగురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను హతమార్చేందుకు ప్రయత్నించారు. 
 
కానీ కుదరకపోవడంతో అక్కడే వదిలి పారిపోయారు. రాత్రికి ఇంటికి చేరుకున్న ఆ ఇంటి కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చూసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో వున్న నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కావేరీ జలాలపై ఓ ఒక్కరికీ హక్కు లేదు : సుప్రీంకోర్టు