ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమ్రొహాలో ఓ వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు కలిపి ఒకేసారి వివాహం జరిపించాలని నిర్ణయించారు. పైగా, అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్టు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అతిథులతో పాటు పెళ్ళికి పిలవని వారు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. అంతమందికీ భోజన ఏర్పాట్లు చేయడంలో వివాహ కుటుంబం విఫలమైంది. పెళ్లికి పిలవని వారు కూడా రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో వారికి ఓ ఆలోచన వచ్చింది.
ఆధార్ చూపిస్తేనే భోజనం ప్లేటు ఇవ్వాలన్న హోటల్ సిబ్బందికి విధించారు. దీంతో ఆధార్ కార్డులు ఉన్నవారు మాత్రం ఆధార్ కార్డు చూపించి భోజనం ప్లేటు తీసుకుని ఫుల్‌గా పెళ్ళి విందు ఆరగించారు. తమ వద్ద ఆధార్ కార్డులు లేనివారు మాత్రం హతాశులయ్యారు.
ఇదేం పద్దతి అంటూ వాపోయారు. పెళ్ళికి పిలిచి భోజనం పెట్టకుండా అవమానిస్తారా? అంటూ వెళ్ళిపోయారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.